Telugu Gateway
Politics

కోర్టులో హెచ్చరికలతో ఈసీఐ ముందు జాగ్రత్త చర్యలు

కోర్టులో హెచ్చరికలతో ఈసీఐ ముందు జాగ్రత్త చర్యలు
X

పశ్చిమ బెంగాల్, తమిళనాడు హైకోర్టుల వ్యాఖ్యలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా రెండవ దశ కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం అధికారులే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు..వీరిపై మర్డర్ కేసు పెట్టాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో సీఈసీ ఫలితాల వెల్లడి సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మే 2న విడుదలయ్యే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమయంలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై సీఈసీ ఆంక్షలు విధించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫలితాలు వచ్చేటప్పుడు గానీ.. ఆ తర్వాత గానీ.. విజేతలైన అభ్యర్థులు సంబరాలు చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, పార్టీ సంబరాలేవీ నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల అనంతరం గెలిచిన‌వారు ఈసీ నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు తీసుకునే స‌మ‌యంలోనూ అభ్య‌ర్థి వెంట‌ ఇద్దరు మించి ఉండ‌కూడ‌ద‌ని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ నిబంధనలను క‌చ్చితంగా పాటించాల‌ని ఆదేశించింది.

Next Story
Share it