Telugu Gateway
Politics

కవిత కోసం బిఆర్ఎస్ మొత్తాన్ని కదిలించిన కెసిఆర్

కవిత కోసం బిఆర్ఎస్ మొత్తాన్ని కదిలించిన కెసిఆర్
X

తెలంగాణ లో ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు నెలల సమయమే ఉంది. ఈ తరుణంలో తెలంగాలో అధికార బిఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ల మధ్య కేసు ల ఫైట్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయంగా ఇది కాంగ్రెస్ కు గోల్డెన్ ఛాన్స్ అన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కేసుల పోరాటంలో ఉండగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తమకు అనుకూలంగా కాంగ్రెస్ మార్చుకుంటే ఆ పార్టీ గెలుపు అవకాశాలు మరింత మెరుగు అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగానే ఉంది. నాయకుల మధ్య అనైక్యతే ఆ పార్టీలో సమస్యగా ఉంది. బిఆర్ఎస్, బీజేపీ ఫైట్ ను వాడుకుని మరింత దూకుడు పెంచితే అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికలను ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్క లిక్కర్ స్కాం ప్రభావితం చేస్తుంది అని చెప్పలేం కానీ...ఖచ్ఛితంగా ఇది బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ ఆరోపణలు మైనస్ గా మారుతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు. ప్రచారం జరుగుతున్నట్లు కవిత అరెస్ట్ అంటూ జరిగితే ఆ డామేజీ మరింత ఎక్కువ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఈ అంశంపై పొలిటికల్ దాడి మరింత పెరగటం ఖాయం. ముఖ్యమంత్రి కెసిఆర్ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కోసం మొత్తం పార్టీ ని కదిలించారు. ఏకంగా మంత్రులు కూడా కవిత కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక పార్టీ నాయకులు, ఎమ్మెల్యే ల స్పందనలు అయితే లెక్కే లేదు. ఇదే బిఆర్ఎస్ కు చెందిన పలువురు ఇతర నాయకులు కూడా కేసు ల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత కు లిక్కర్ స్కాం లో ఈడీ నోటీసులు జారీచేసిన తర్వాత మీడియా తో మాట్లాడిన మంత్రి కేటిఆర్ కూడా తమ పార్టీ నాయకుల కేసు ల లిస్ట్ చెప్పారు.

కానీ ఏ కేసు ల సమయంలో స్పందించని రీతిలో కవిత కేసు ఒక్క కేసు విషయంలో స్పందించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తేడా ఎందుకో అందరికి తెలుసు. కవిత కు నోటీసు లు ఇస్తే దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలపై ఉన్న కేసు లు...ఇతర పార్టీ ల నుంచి బీజేపీ లో చేరి కేసుల విచారణ తప్పించుకున్న వారి పేర్లను బిఆర్ఎస్ నేతలు చెపుతూ పోతున్నారు. వాళ్ళ వాదన ఎలా ఉంది అంటే బీజేపీ లో అంత మంది మీద కేసు లు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళ మీద కేసు లు ఎలా పెడతారు అని అన్న చందంగా ఉంది అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. . ఒక్క మాట మాత్రం నిజం. బీజేపీ లో ఉన్న నేతలు చాలా మంది పై కేసు లు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యమే. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే తనయుడు ఎనిమిది కోట్ల నగదు తో దొరికిన అరెస్ట్ లు లేవు. చట్టాలు అన్ని ఇప్పుడు బీజేపీ కి అనుకూలంగా పనిచేస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళ విషయంలో మాత్రం స్పీడ్ గా ఉంటున్నాయి. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ అనుకూల వాతావరణాన్ని ఎలా వాడుకుతుందో అన్నది వేచిచూడాల్సిందే. బిఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల స్కాం లో జాబితా చెపుతుంటే...తెలంగాణ బీజేపీ నేతలు కవిత గతంలో చెప్పిన మాటల అప్పు తీసుకుని ఇల్లు కొన్నాను..షో మాన్ షిప్ ఉండదు మా దగ్గర అన్న మాటలు...ఇప్పుడు 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కున్నాను..నేను డబ్బులు లేని కుటుంబంలో పుట్టలేదు అని చెప్పిన మాటలను వైరల్ చేస్తున్నారు. అటు వైపు..ఇటు వైపు కూడా వీడియో ల గేమ్ కూడా జోరుగా నడుస్తోంది.

Next Story
Share it