బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్
BY Admin25 April 2022 10:40 AM
X
Admin25 April 2022 10:40 AM
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన డాక్టర్ల సలహాను పెడచెవిన పెట్టి పాదయాత్ర కొనసాగించారు. అయితే సోమవారం నాడు పరిస్థితి మరింత నీరసించటంతో బండి యాత్రకు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వడదెబ్బ కారణంగా ఆయన బాగా నీరసించారని డాక్టర్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బండి యాత్ర తెలంగాణలో రాజకీయ వేడి పెంచిందనే చెప్పాలి. పాదయాత్ర సందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేయటం..దీనికి టీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తుండటంతో రాజకీయం రంజుగా మారింది.
Next Story