ఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
ఆ స్టాక్ డైలాగ్ నే పదే పదే వాడటం వల్ల అసలు బిజెపి నేతలు చెప్పే మాటలతో ప్రజలు ఎక్కడైనా కనెక్ట్ అవుతారా?. ఇలా పాచిపోయిన డైలాగ్ వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది. గత ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టులో అవినీతి గురించి చెప్పటానికి వాడిన ఏటీఎం డైలాగ్ లు ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి గురించి ప్రస్తావించటానికి వాడుతున్నారు. హోం మంత్రి అమిత్ షా దగ్గర నుంచి జె పి నడ్డా. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి, ఇప్పుడు షెకావత్. అంతా ఏటీఎంలో స్ట్రక్ అయినవారే. ఈ డిజిటల్ యుగంలో ఎన్నో కొత్త చెల్లింపు పద్దతులు వచ్చాయి. అయినా బిజెపి నేతలు మాత్రం ఇంకా ఏటీఎంలోనే స్ట్రక్ అయిపోయారు. వీరు ఇందులో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు..ఆరోపణలు నిరూపించి ఎప్పుడు సత్తా చాటుతారు అన్నది వేచిచూడాల్సిందే.