బండి సంజయ్ పాదయాత్ర పిక్స్
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే ముఖ్యమంత్రి కెసీఆర్ దళిత సాధికారత సమావేశమని ఏర్పాటు చేశారని బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో దళితులకు రక్షణ కరువైందని అన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, 125 అడుగల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు ఎటు వెళ్ళాయో కేసీఆర్ చెప్పాలన్నారు. ఉచిత వ్యాకిన్, రేషన్ బియ్యం కేంద్రం ఇస్తున్నా ప్రధాని మోదీ ఫోటో పెట్టడం లేదన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆగస్ట్ 9 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు. నగరంలోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించి.. హుజురాబాద్‌లో ముగించనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. జల వివాదం పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రణాళిక ప్రకారమే ఇద్దరు ముఖ్యమంత్రులు సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు. హుజురాబాద్‌లో రాజకీయ లబ్ధి కోసమే జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శించారు. కృష్ణానది జలాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అని కేసీఆర్ రాసిన లేఖ బూటకం అన్నారు. కేసీఆర్ తీరు వలనే తెలంగాణకు 575 టీఎంసీల రావాల్సిన చోట 299 టీఎంసీలకు పరిమితం చేశారన్నారు. కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టినా.. హుజురాబాద్‌లో గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనన్నారు. చాలా ఈజీగా బీజేపీ హుజురాబాద్‌లో గెలవబోతోందన్నారు. దుబ్బాక మాదిరిగానే బీజేపీ ఉత్సాహంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రానా వెనకడుగు వేసినట్లు కాదన్నారు. కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.