రాముడి పేరుతో బాధ్యత లేకుండా బిజెపి వసూళ్లు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిపై..అయోధ్య రామాలయంపై వరస పెట్టి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేరారు. శ్రీ రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం నాడు పరకాలలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన .. బీజేపీ వాళ్లే కాదు తాము కూడా హిందువులమే అంటూ ఆ పార్టీ నేతలలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ.. దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని.. వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో..? లెక్కలు చెప్పాలని చల్లా ప్రశ్నించారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. 29 రాష్ట్రాల్లో రూ. 29 వేలకోట్లు ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించిన మీరు.. ఇప్పుడు శ్రీరాముడి గుడిని నిర్మించలేరా..? అని బిజెపి నేతలపై చల్లా ప్రశ్నల వర్షం కురిపించారు.