నాగార్జునసాగర్ బిజెపి అభ్యర్ధి రవికుమార్
తెలంగాణలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించింది. నామినేషన్లకు చివరి రోజు మంగళవారం కాగా, సోమవారం రాత్రి అభ్యర్ధి పేరును వెల్లడించారు. ఇంత కాలం టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎవరిని బరిలో నిలుపుతుందా అని చూసిన పార్టీ డాక్టర్ పానుగోతు రవికుమార్ ను సాగర్ అభ్యర్ధిగా ఎంపిక చేసింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటకట్టుకున్న బిజెపికి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. బిజెపి తో పోలిస్తే అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ లే నియోజకవర్గంలో ఎక్కువ పట్టు కలిగి ఉన్నాయి.
మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్ కూడా సోమవారం నాడే దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ ను సీఎం కెసీఆర్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి బీ ఫాం అందజేశారు. ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ టిక్కెట్ నివేదిత రెడ్డికి ఖరారు అయింది అంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రవికుమార్ పేరును ఖరారు చేసింది.