Telugu Gateway
Politics

బీహార్ ఎగ్జిట్ పోల్...లీడ్ లో తేజస్వి కూటమి!

బీహార్ ఎగ్జిట్ పోల్...లీడ్ లో తేజస్వి కూటమి!
X

ప్రతిష్టాత్మకంగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగలనుందా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికే సానుకూలత ఉన్నట్లు కన్పిస్తోంది. విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటే తేజస్వి యాదవ్ ముందు ఉండటం విశేషం. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే మాత్రం పెద్ద సంచలనంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ కు 36 శాతం మంది మద్దతు పలకగా, నితీష్ కుమార్ కు 34 శాతం మాత్రమే మద్దతు లభించింది.

సుశీల్ కుమార్ మోడీ 11 శాతంతో చాలా వెనకబడి ఉన్నారు. పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం ఆర్జేడీకి 85 నుంచి 95 సీట్లు దక్కనున్నాయి. బిజెపికి 65 నుంచి 75 సీట్లు, జెడీయూకి 25 నుంచి 35, కాంగ్రెస్ కు 15 నుంచి 20, లెఫ్ట్ పార్టీలకు 3 నుంచి 5 , ఎల్జేపీకి 3 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసిన నిరుద్యోగం (31 శాతం), ధరల పెరుగుదల 28 శాతం, వలసల అంశం 19 శాతంగా ఉంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే జెడీ యూకి భారీ దెబ్బ పడనుంది. బిజెపి మాత్రం తన పరువు కాపాడుకోనుంది.

Next Story
Share it