పనిచేయని కెసీఆర్ ఆత్మప్రభోదం పిలుపు..ముర్ము ఘన విజయం
తొలి ప్రయత్నంలోనే కెసీఆర్ కు షాక్!
ఎందుకంటే కారణాలు ఏమైనా వైసీపీతోపాటు బిజెడి వంటి పార్టీలు ఎన్డీయే అభ్యర్ధికే మద్దతు ఇస్తారని విషయం ముందు నుంచే ప్రచారంలో ఉంది. చివరకు అదే జరిగింది. అయితే బిజెపి ప్రతిపాదించిన అభ్యర్ధి గెలుస్తారు అన్న విషయం తెలిసినా కూడా పోటీలేకుండా ఏకపక్షంగా బిజెపికి ఎందుకు గెలుపు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్ధిని బరిలోకి దింపాయి. అంతే తప్ప..ఖచ్చితంగా గెలుస్తారనే ధీమాతో కాదనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న మోడీ సర్కారు ప్రజాస్వామ్య సంప్రదాయాలను తుంగలో తొక్కి ..అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందున ఆ పార్టీ అభ్యర్ధికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వటం అన్నది జరిగే పని కాదు. అందుకే బిజెపి దేశంలోనే తొలిసారి ఓ గిరిజన మహిళను బరిలోకి దింపినా ప్రతిపక్ష పార్టీలు ఓటమి తప్పదనే విషయం తెలిసినా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ఇదే బాటలో టీఆర్ఎస్, సీఎం కెసీఆర్ ఆయనకు మద్దతు ప్రకటించి ..ఓట్లు వేసి ఉంటే సరిపోయేదని..అలా కాకుండా కెసీఆర్ స్వయంగా ఆత్మప్రభోదానుసారం ఓట్లు వేయాలని పిలుపునిచ్చి పరువు తీసుకున్నట్లు అయిందనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో కూడా వ్యక్తం అవుతోంది.