కుప్పంలో చంద్రబాబుకు షాక్
BY Admin17 Feb 2021 10:14 PM IST
X
Admin17 Feb 2021 10:14 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి షాక్. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. అధికార వైసీపీనే ఈ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ లను కైవసం చేసుకుంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామమే. సొంత నియోజకవర్గంలో సర్పంచ్ లను గెలిపించుకోలేకపోయిన చంద్రబాబుకు రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి పది గంటల సమయానికి వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాలతో ముందు ఉంది. పంచాయతీ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి గెలుపు క్లైయింల విషయంలో కూడా వివాదాలు నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు చెప్పుకునే లెక్కలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నియోజకవర్గంలోనే టీడీపీకి షాక్ తగలటం మరింత కీలకంగా మారింది.
Next Story