Telugu Gateway
Politics

క‌ర్ణాట‌క‌కు కొత్త సీఎం వ‌చ్చేశారు

క‌ర్ణాట‌క‌కు కొత్త సీఎం వ‌చ్చేశారు
X

య‌డ్యూర‌ప్ప రాజీనామా చేశారు. బ‌స‌వ‌రాజు బొమ్మై వ‌చ్చేశారు. క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వం మార్పు పూర్తి అయింది. క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై బుధ‌వారం నాడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో ఆయ‌న కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా నిలిచారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బొమ్మైతో ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్ బొమ్మై ఆశీర్వాదం తీసుకున్నారు. మంగళవారం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది.

మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. అయితే మ‌రి బ‌స‌వ‌రాజు ప‌రిపాల‌నా కాలం అయినా సాఫీగా సాగుతుందా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే. అయితే మ‌రి ఇప్పుడు బ‌స‌వ‌రాజు క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం మార్పుకు స‌హ‌క‌రించిన ఫిరాయింపు నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తారా లేక సొంత పార్టీ వారికే ఇస్తారా?. ఇస్తే మిగ‌తా వారు ఎలా స్పందిస్తారు అన్న‌ది ఇప్పుడు అత్యంత కీల‌కం కానుంది.

Next Story
Share it