వరదలు వస్తే ప్రజల్లో లేని ముఖ్యమంత్రి ఎందుకు?
BY Admin27 Nov 2020 12:20 PM IST
X
Admin27 Nov 2020 12:20 PM IST
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో వరదలు వస్తే ప్రజల్లో లేని ముఖ్యమంత్రి ఎందుకు అంటూ ప్రశ్నించారు. డీజీపీపై కూడా సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీజీపీ వ్యాఖ్యలు సిగ్గుమాలిన చర్య అని ఆరోపించారు. ఆయన శుక్రవారం ఉదయమే నగరంలో బిజెపి అభ్యర్ధుల తరపున ప్రచారంలోకి దిగారు.
వంద శాతం సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరతామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. హిందూ రాజ్యస్థాపన కోసం బిజెపి యుద్ధం చేయబోతోంది. రోహింగ్యాలను తరిమికొట్టే బాద్యత బిజెపిదే అన్నారు. సీఎం కెసీఆర్ ను హిందువుగా ఎవరూ గుర్తించటంలేదని వ్యాఖ్యానించారు.
Next Story