రైతుల పాలిట రాబంధుగా మారిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల పాలిట ముఖ్యమంత్రి రాబంధుగా మారారు అని ఆరోపించారు. పోయిన సారి నీ మంత్రులు..ఎమ్మెల్యేలు, నాయకులు చేసిన రీసైక్లింగ్ స్కామ్ ను కూడా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. పోయినసారి కేంద్రానికి ఎన్నిక్వింటాళ్లు ఇస్తానన్నావు..ఎన్ని ఇచ్చావు అని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో వరి బంద్ చేయాలని చెప్పారని ప్రశ్నించారు. . వరి వేస్తే ఉరి అని ఎందుకు అన్నావు ..ఏ ఉద్దేశంతో చెప్పావు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఘోస పడుతున్నారు. ఏదైనా మాట్లాడితే రాజకీయ కోణం అంటావు..నీ కళ్ళలో అంతా మంచి కోణమే కన్పిస్తుందా? ఈ పిట్టల దొర మాయ మాటలు నమ్మకండి. కేంద్రం కొనటానికి సిద్ధంగా ఉంది. కేవలం ప్రజలను గందరగోళంలో నెట్టడానికే ఇలా చేస్తున్నాడు. రుణ మాఫీ చేస్తానని చేయడు, .యూరియా ఫ్రీ అని అది కూడా ఇవ్వడు. ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సీడీలు బంద్ చేశాడు. నష్టాన్ని పూడ్చుకోవటానికే తెలంగాణలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నీ హయాంలో రైతులు ఏడుస్తున్నారు ఇది మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఈ యాసంగిలో ఎంత పంట వస్తది..కేంద్రానికి ఎంత ఇవ్వాలన నిర్ణయించుకున్నారో స్పష్టం చేయాలన్నారు.
ఆ మొత్తం కేంద్రం కొనేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది కలెక్టర్లు బరితెగించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వారిపై చట్టపరంగా న్యాయపరంగా చర్యలు ఉంటాయి. వాళ్లపై ఫిర్యాదులు చేస్తున్నాం. నీ అధికారులను హద్దుల్లో ఉంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడటం...ముఖ్యమంత్రి మెప్పు కోసం కాళ్లు మొక్కటం..పోస్టింగ్ లు..ప్రమోషన్ల కోసం ఇలా చేయటం సరికాదన్నారు. వరి సాగు, రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం రైతు దీక్ష చేపట్టారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక వైఖరి విడనాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా పోరాటం చేస్తామన్నారు.