Telugu Gateway
Politics

కెసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌

కెసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ కి బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్‌లో ముగ్గురు కాదని.. 8మంది బీసీలకు స్థానం కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలన్నారు. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలన్నారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంద‌ని విమ‌ర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో బీసీ సబ్ ప్లాన్ అటకెక్కిందని బండి సంజయ్ ఆరోపించారు.

బీసీ సబ్ ప్లాన్‌కు చట్ట భద్రత కల్పించాలని, 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న ఆత్మగౌరవ భవనాల అడ్రస్ ఎక్కడని ప్రశ్నించారు. రూ. 3,400 కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాల‌ని కోరారు. చేనేత కార్మికులకు భీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, గీత కార్మికులను ఆడుకోవడంతో పాటు.. రజకుల‌ కోసం దోబీ ఘాట్‌లను నిర్మించాలన్నారు. బ్రాహ్మణులకు 2వందల యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వాలని, ఎంబీసీ కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు కేటాయించాలని బండి సంజయ్ త‌న‌ లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it