Telugu Gateway
Politics

పువ్వాడ అజ‌య్ వి హ‌త్యా రాజ‌కీయాలు

పువ్వాడ అజ‌య్ వి హ‌త్యా రాజ‌కీయాలు
X

బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హ‌త్యా రాజ‌కీయాలు చేస్తున్న మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ను వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాసంగ్రామ యాత్ర‌లో ఉన్న బండి సంజయ్‌.. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సంస్మరణ సభ సందర్భంగా జూమ్ లైవ్ ద్వారా మాట్లాడారు. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకరమన్న ఆయన.. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

సాయి గణేష్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు. అతనిపై 16కేసులు పెట్టీ రౌడీ షీట్ ఒపెన్ చేశారు. బలవన్మరణానికి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం అని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ చిట్టా అంతా మాకు తెలుసు అని హెచ్చ‌రించారు. పువ్వాడను విడిచిపెట్టేదే లేదు..ఆయ‌న . సంగతి తేలుస్తామ‌న్నారు. ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాం. సాయి గణేష్ ఘటనపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణకు కోరాల‌ని డిమాండ్ చేశారు.

Next Story
Share it