Telugu Gateway
Politics

కెసీఆర్ ఆ ఛాన్స్ మిస్ చేశారు

కెసీఆర్ ఆ ఛాన్స్ మిస్ చేశారు
X

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గోదావరి, కృష్ణా బోర్డుల స‌మావేశానికి గైర్హాజ‌రు కావ‌టంపై మండిప‌డ్డారు. ఈ స‌మావేశాల‌కు హాజ‌రు అయి ఏపీ అక్ర‌మ ప్రాజెక్టుల గురించి ప్ర‌స్తావించే అవ‌కాశాన్ని తెలంగాణ కోల్పోయింద‌ని అన్నారు. అస‌లు కెసీఆర్ కు తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే ఉద్దేశం ఉందా లేదా అని ప్ర‌శ్నించారు. కొంత మంది కాంట్రాక్ట‌ర్ల‌కు మేలు చేసేలా అంతా అయిపోయే వ‌ర‌కూ ఆగి త‌ర్వాత రాద్ధాంతం మొద‌లుపెట్టార‌ని ఆరోపించారు. నదీజలాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నీటి సమస్యల పరిష్కారం కోసం విభజన చట్టంలోని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోటిఫై చేశారని పేర్కొన్నారు.

బోర్డుల సమావేశానికి ఇరు బోర్డుల అధికారులు హాజరయ్యారు. కానీ కేసీఆర్ డుమ్మా కొట్టారని చెప్పారు. హైదరాబాద్ జల సౌదలో తెలంగాణ ఈఎన్ సీ సమావేశానికి హాజరుకాలేదన్నారు. ఎందుకు హాజరు కాలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అధికారులు సమావేశానికి హాజరైతే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేదన్నారు. అలాగే తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉండేదన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తాను కేంద్రాన్ని కోరితే.. ఆగస్టు 5న సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు.

Next Story
Share it