బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు
BY Admin24 Nov 2020 11:26 AM

X
Admin24 Nov 2020 11:26 AM
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మేయర్ పీఠం బిజెపికి దక్కితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన నగరంలోని ఉప్పల్, రామంతపూర్‌లో సంజయ్ ప్రచారం నిర్వహించారు.
టీఆర్‌ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయంసాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story