Telugu Gateway
Politics

మళ్ళీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు చర్చ!

మళ్ళీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు చర్చ!
X

రెండేళ్లు గడువు ఇవ్వండి. ఆ తర్వాత రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయండి. ఇప్పుడు అసలు ఈ నోటు కొనసాగించటంలో ఏ మాత్రం అర్ధం లేదు. కేవలం డ్రగ్స్ దిగుమతి..మనీ లాండరింగ్ కి మాత్రమే ఇవి పనికొస్తున్నాయ్. ఈ మాటలు అన్నది ఎవరో ప్రతిపక్ష నేతలు కాదు. బీజేపీ సీనియర్ నేత,,బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి..ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ. సోమవారం నాడు అయన రాజ్యసభలో ఈ అంశంపై చేసిన వ్యాఖలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మోడీ సర్కారు ఏమి చెప్పి నోట్ల రద్దు చేసిందో ఆ లక్ష్యాలు ఏ మాత్రం నెరవేరలేదు. పైగా డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు చలామణి 2016 కంటే భారీగా పెరిగినట్లు ఇటీవల ఆర్ బీఐ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. 2016 నవంబర్ 8 వ తేదీన వెయ్యి రూపాయలు, ఐదొందల నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కొత్తగా 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తీసుకొచ్చింది.

చిన్న నోట్లు రద్దు చేసి పెద్ద నోట్లను చెలామణిలో ఉంచడం సరికాదని సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా పెద్ద నోట్లు చెలామణిలో లేవన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత కేంద్రం రద్దు చేస్తే బాగుంటుందని సుశీల్ మోదీ సూచించారు. ఏటీఎంలలో కూడా 2 వేల నోట్ల రూపాయలు రావడం లేదని కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. 2 వేల రూపాయల నోట్లపై అనేక అపోహలున్నాయని, వాటిపై కేంద్రం స్పష్టతనీయాలని సుశీల్ మోడీ కోరారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి ఈ నోట్లు ఎప్పుడో మాయం అయ్యాయి. అసలు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.



Next Story
Share it