Telugu Gateway
Politics

ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలి

ఏపీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలి
X

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉన్నారు. ఆయన బుధవారం నాడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గ్రామాల్లో యధేచ్చగా దోపిడి చేసేందుకే వైసీపీ ఏకగ్రీవాల జపం చేస్తోంది. ఎప్పుడో 10నెలల క్రితం ఇచ్చిన జీవోకు ఇప్పుడు ఫుల్ పేజి యాడ్స్ మరో తుగ్లక్ చర్య. తెలంగాణ లోగో ఉన్న పంచాయితీ కార్యాలయ భవనం ఫొటో ముద్రించడం సిగ్గుచేటు. అధికార దుర్వినియోగానికి, ప్రజాధనం దుర్వినియోగానికి పరాకాష్ట. ముఖ్యమంత్రిగా ఉండటానికే జగన్ రెడ్డి అనర్హుడు. చేయని తప్పుడు పనిలేదు, పాల్పడని అరాచకం లేదు. తప్పుడుపనులకు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా జగన్మోహన్ రెడ్డి మారాడు. ఈసి శిక్షించిన అధికారులకు డబుల్ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా..? రాజ్యాంగంపై ప్రమాణం చేసి, అదే రాజ్యాంగం ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి మంత్రి పదవికే అనర్హుడు.

ఇప్పటికే వైసీపీ నాయకులు ఆంబోతుల్లా మారి రాష్ట్రంలో అభివృద్ది అంతా నాశనం చేశారు.ఈ ఆంబోతులకు పంచాయితీ ఎన్నికల్లో ముక్కుతాడు వేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిపేయాలి. ప్రభుత్వ మద్యం దుకాణాలను, లిక్కర్ షాపులను మూసేయాలి, వైసిపి మొబైల్ బెల్ట్ షాపులను నిలిపేయాలి. ప్రజాధనంతో ప్రభుత్వ యాడ్స్ నిలిపేయాలి. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు తొలగించాలి.' అని వ్యాఖ్యానించారు. 'పంచాయితీ ఎన్నికలను ప్రతి టిడిపి కార్యకర్త, నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గత మార్చిలో ఎంపిటిసి, జడ్ పిటిసి నామినేషన్లలో వైసిపి అరాచకాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. ఆ రోజు కూడా మనం వీరోచితంగా పోరాడాం. 25% పైగా ఏకగ్రీవాలు బలవంతంగా చేశారు. బెదిరించి, ప్రలోభ పెట్టి అధికారులను లొంగదీసుకుని అరాచకాలు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంపడటం, సర్టిఫికెట్ల కోసం వెళ్తే భౌతికదాడులకు పాల్పడటం, నామినేషన్ పేపర్లు బలవంతంగా లాక్కోవడం, అధికారుల ఎదుటే దౌర్జన్యాలు చేయడం, కిడ్నాప్ లకు పాల్పడటం, హత్యాయత్నాలు...వైసిపి ఉన్మాదాలకు పరాకాష్ట.

ఆ తరువాత రాజ్యాంగ విరుద్దంగా ఇక్కడి ఈసిని తొలగించి, తమిళనాడు నుంచి ఇంకో ఈసిని తీసుకొచ్చి అతనితో ప్రమాణం చేయించి జగన్ డ్రామాలను చూశాం. పంచాయితీల్లో పోటీకి భయపడే జగన్ జిత్తులు..ఓటమి భయంతోనే జగన్నాటకాలు..ప్రలోభాలు, వేధింపులు,బెదిరింపులు,హింసా విధ్వంసాలే జగన్ దినచర్య..భయభ్రాంతులను చేసి గెలుపొందడమే పులివెందుల పంచాయితీ. జగన్ రెడ్డి సిఎం కాగానే రాష్ట్రవ్యాప్తంగా అదే దుష్ట సంస్కృతి. జగన్ సిఎం అయ్యాక అధికార యంత్రాంగం నీరుగారిపోయింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా తెగించారు. అధికారుల్లో కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారు. ' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it