Telugu Gateway
Politics

మార్చిలో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు

మార్చిలో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు
X

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మూడు రాజ‌ధానుల బిల్లును వ‌చ్చే మార్చిలో తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పాత బిల్లులో కొన్ని పొర‌పాట్లు ఉన్నందున వాటిని వెన‌క్కి తీసుకున్నామ‌న్నారు. మార్చిలోపు ఈ అంశంపై అంద‌రితో చ‌ర్చ‌లు జ‌రిపి బ‌డ్జెట్ స‌మావేశాల్లో తిరిగి బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, నారా లోకేష్ లు చేసేవ‌న్నీ డ్రామాలే అన్నారు. టీడీపీ ఏపీలో ఇక బ‌తికిబ‌ట్ట‌క‌ట్ట‌లేద‌న్నారు. ఒక వేళ అలా జ‌ర‌గాలంటే ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు ఎవ‌రైనా ముందుకు రావాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

Next Story
Share it