నా అరెస్ట్ ఎవరివల్లా కాదు
BY Admin27 May 2021 8:52 PM IST
X
Admin27 May 2021 8:52 PM IST
బాబా రామ్ దేవ్..ఐఎంఏల మధ్య వివాదం ముదురుతోంది. రామ్ దేవ్ తోపాటు పతంజలి సంస్థ ప్రతినిధులు కూడా నిత్యం కయ్యానికి కాలుదువ్వేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అరెస్ట్ బాబా రామ్ దేవ్ ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై ఆయన మండిపడ్డారు. 'నన్ను అరెస్ట్ చేయడం అతడి తండ్రి వల్ల కూడా కాదు' అని వ్యాఖ్యానించాడు. జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దుండగుడు రాందేవ్, మహాదొంగ రాందేవ్ వంటి పదాలు తనపై వస్తున్నాయని తెలిపారు. తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ విభాగం వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఈ వివాదం సద్దుమణగకపోగా రోజుకో మలుపు తిరుగుతోంది.
Next Story