ఏపీ సీఐడీ కృష్ణ ఎల్లా..పూనావాలాను ఎత్తుకురాలేదా?
కర్నూలు స్టేషన్ లో కేసులు పెట్టలేమా?
ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ అంశంపై ఆయన స్పందించారు. అయ్యన్నపాత్రుడు ట్వీట్....'మన ఎసిబి... సీఐడీ ని పంపించి సంగం డైరీ ని స్వాధీనం చేసుకొని అమూల్ కు అప్పచెప్పినట్లు భారత్ బయో టెక్, సీరం ఇనిస్టిట్యూట్ లను స్వాధీనం చేసుకొని మన వాళ్లకు ఇవ్వడం కుదరదా జగన్ రెడ్డి గారు?
మన ఎసిబి, సీఐడీ కృష్ణ ఎల్లా... పూనావాలా ను ఎత్తుకు రాలేరా? ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూల్, కడప స్టేషన్ల లో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా? సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి పోరా? ఏంది వాళ్ళను అడుక్కొనేది?' అంటూ పోస్టు పెట్టారు.