సీఐపై దాడి కేసు..ఏ1గా నారా లోకేష్
BY Admin20 Oct 2021 9:00 AM

X
Admin20 Oct 2021 9:00 AM
ఏపీ రాజకీయం కేసులతో హోరెత్తుతోంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. పరస్పర దాడులకు దిగుతున్నారు. మంగళవారం నాటి దాడుల అనంతరం టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ కేసు నమోదు అయింది. మంగళగిరి పోలీస్ స్టేషనులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ పేర్లు పెట్టారు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.
Next Story