Telugu Gateway
Politics

ఏపీఐఐసీ ఛైర్మ‌న్ గా గోవింద్ రెడ్డి..వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా విజయనిర్మల

ఏపీఐఐసీ ఛైర్మ‌న్ గా గోవింద్ రెడ్డి..వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా  విజయనిర్మల
X

ఆంధ్రప్రదేశ్‌లో కీల‌క కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్ల నియామ‌కాలు పూర్త‌య్యాయి. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు జోడు ప‌ద‌వుల విదానానికి కూడా స్వ‌స్తి ప‌లికారు. గ‌తంలో వారికి కేటాయించిన పోస్టులు త‌ప్పించి..కొత్త వారికి ఇచ్చారు. గ‌త కొన్ని రోజులుగా సీఎం జ‌గ‌న్ నామినేటెడ్ ప‌ద‌వుల నియామ‌కంపై క‌స‌ర‌త్తు చేశారు. ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌టంతో శ‌నివారం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఎవ‌రెవ‌రికి ఏయే ప‌ద‌వులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తో క‌ల‌సి మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చిన విష‌యాన్నిరామకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.

పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నార‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేటెడ్‌ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.

నామినేటెడ్‌ పోస్టుల వివరాలు..

ఏపీఐఐసీ ఛైర్మ‌న్ మెట్టు గోవింద్ రెడ్డి

మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకట్‌రెడ్డి

సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి

వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు

గ్రంథాలయ సంస్థ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి

ఆర్టీసీ రీజనల్‌ ఛైర్మన్‌గా గాదల బంగారమ్మ

టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌

హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి

డీసీఎంఎస్ ఛైర్మన్‌గా అవనపు భావన

బుడా ఛైర్మన్‌గా ఇంటి పార్వతి

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌

ఏలేశ్వరం డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా శైలజ

డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కెల నాయుడుబాబు

ఉమన్‌ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలిని

ఏపీ గ్రీన్‌ అండ్‌ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రామారావు

ఏపీ ఎండీసీ ఛైర్మన్‌గా సమీమ్‌ అస్లాం

Next Story
Share it