Telugu Gateway
Politics

ఆ మంత్రిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దు

ఆ మంత్రిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దు
X

ఎస్ఈసీ సంచలన ఆదేశం, మీడియాతో మాట్లాడనివ్వొద్దు

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం కొత్త మలుపుతిరిగింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకూ ఇంటికే పరిమితం చేయాలని ఏపీ డీజీపిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. అంతే కాదు..ఆయన మీడియాతో కూడా మాట్లాడకుండా చూడాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆదేశాలకు పురికొల్పిన కారణాలను తన ఆదేశాలతోపాటు పెద్దిరెడ్డి గతంలో మీడియాలో మాట్లాడిన అంశాలను కూడా ప్రస్తావించారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎస్ఈసీ చెప్పినట్లు వింటే వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ హెచ్చరించారు.

ఏకగ్రీవాల విషయంలో ధృవపత్రాలు ఇవ్వకపోతే సరికాదని హెచ్చరించారు. ఇది సర్కారు, ఎస్ఈసీ మధ్య ఘర్షణను మరింత పెంచేలా కన్పిస్తోంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎస్ఈసీ ఆదేశాలను మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో తాజాగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇఫ్పుడు ఎస్ఈసీ నిర్ణయాన్ని డీజీపీ అమలు చేస్తారా?. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it