Telugu Gateway
Politics

వేలు పెట్టి వార్నింగ్ ఇస్తావేంటి..టేక్ కేర్

వేలు పెట్టి వార్నింగ్ ఇస్తావేంటి..టేక్ కేర్
X

చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని హెచ్చరిక

ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ ల మధ్య కూడా తీవ్ర వాదోపవాదాలు సాగాయి. స్పీకర్ తమ్మినేని సీతారం ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. 'మనం అసెంబ్లీలో ఉన్నాం. నిలబడితే అద్దం ముందు నిలబడినట్లే. జాగ్రత్తగా ఉండాలి మనం కొద్దిగా. ఏంటి మాట్లాడతావు. జాగ్రత్త. టేక్ కేర్ అంటూ ' చేతిలో ఉన్న వస్తువును స్పీకర్ తమ్మినేని విసిరేశారు. దీంతో టీడీపీ సభ్యులు సీట్లలో నుంచి లేచి చంద్రబాబు వద్దకు వస్తారు. ఏంటి బెదిరిస్తున్నారా అంటూ స్పీకర్ ఆగ్రహంతో ఊగిపోతారు. ఈ ఉడత ఊపులకు, పిల్లి శాపనార్ధాలను బయటపడను. ఏమనుకుంటున్నారు మీరు. వేలు పెట్టి వార్నింగ్ ఇస్తారేంటి. టేక్ కేర్. ఏమనుకుంటున్నావు. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తారు. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు రావటంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఏమనుకుంటున్నారు మీరు. సిడౌన్ . మీరు వెళ్లి కూర్చోండి. మీరు చిట్టీ ఇచ్చి చదువు అంటారు. మీరు ఇక్కడ నుంచి డిక్టేట్ చేస్తే ఏమీ ఇవ్వను. ఏమీ చేయను.

పోడియం చుట్టుముట్టడం మీ అర్హతా. మీ హక్కా. మీ స్థానాల్లో వెళ్ళి మీ వాదనను విన్పించండి. సీట్లలో వెళ్ళి కూర్చుంటే మాట్లాడే చాన్స్ ఇస్తానంటారు స్పీకర్. చంద్రబాబు తీరుపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్‌ పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు ఖండించారు. స్పీకర్‌కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని, సభలో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. ప్రజల ఇచ్చిన తీర్పు ప్రకారమే సభలో మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Next Story
Share it