Telugu Gateway
Movie reviews

'లైగ‌ర్' మూవీ రివ్యూ

లైగ‌ర్ మూవీ రివ్యూ
X

భారీ అంచ‌నాల మధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన 'లైగ‌ర్' సినిమా గురువారం నాడు విడుద‌లైంది. అటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ఇటు పూరీ జ‌గ‌న్నాధ్ లు ఇద్ద‌రూ చాలా గ్యాప్ త‌ర్వాత కొత్త సినిమాతో వ‌చ్చారు. అంతే కాదు..విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఈ పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. లైగ‌ర్ సినిమాకు ఉప శీర్షిక కూడా ఉంది. అది ఏమిటంటే సాలా క్రాస్ బీడ్ అని. లైగ‌ర్ అంటే సింహం..పులికి పుట్టిన వాడు అంటూ ఓ కొత్త నిర్వ‌చ‌నం కూడా ఇచ్చారు. ఇది బాగానే ఉంది కానీ సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్షకుల‌కు కూడా ఇదే అనుభూతి వ‌స్తుంది. అది ఏమిటంటే లైగ‌ర్ మాత్ర‌మే క్రాస్ బ్రీడ్ కాదు..సినిమా కూడా క్రాస్ బీడే అని. ఓ అమ్మా..నాన్న త‌మిళ అమ్మాయి..జైల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ చేసిన న‌త్తి ప్ర‌యోగం రిపీట్..హీరో టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రియురాలు కావాల‌ని గొడ‌వ పెట్టుకుని వెళ్లిపోవ‌టం..త‌ర్వాత తండ్రి ఆ విష‌యం చెప్పే సీన్లు అన్నీ తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూసీ చూసీ ఉన్న‌వే. సినిమా అంతా కూడా మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) చుట్టూనే తిరుగుతంది. తొలి భాగంలో సినిమా కాస్త స‌ర‌దా స‌ర‌దాగా సాగిన‌ట్లు అన్పించినా త‌ర్వాత గాడిత‌ప్పింది.

అయితే సినిమాలో ఎక్క‌డా కూడా ఈ సీన్ సూప‌ర్..ఈ సంద‌ర్భం సూప‌ర్ అనే ప‌రిస్థితి ఉండ‌దు. అయితే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం ఈ సినిమా కోసం ప‌డిన క‌ష్టం తెర‌పై క‌న్పిస్తుంది. త‌ల్లి ర‌మ్య‌క్రిష్ణ కోరిక మేర‌కు తొలుత జాతీయ చాంఫియ‌న్ గా అవ‌త‌రించి త‌ర్వాత దేశం ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చేయ‌ని అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు కూడా రెడీ అవుతాడు. ర‌మ్య‌క్రిష్ణ పాత్ర‌లో కూడా ఏ మాత్రం ద‌మ్ములేదు. చాలా రొటీన్ గా సాగుతుంది. హీరోయిన్ అన‌న్య‌పాండే పాత్ర..పాట‌లు కూడా ఏ మాత్రం ఆక‌ట్టుకోవు. సినిమాలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ఎక్క‌డా వంక పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. కానీ క‌థ‌లో ద‌మ్ములేక‌పోవ‌టంతో ఆయ‌న క‌ష్టం కూడా వేస్ట్ అయింద‌నే చెప్పొచ్చు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన లైగ‌ర్ మాత్ర‌మే క్రాస్ బ్రీడ్ కాదు..సినిమా కూడా క్రాస్ బ్రీడ్ అని చెప్పుకోవ‌చ్చు. గ‌త కొంత కాలంగా పూరీ జ‌గన్నాథ్ సినిమాలు పెద్ద‌గా క్లిక్ కావ‌టం లేదు. విజ‌య్ దేవ‌రకొండ రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చినా అభిమానుల‌ను కూడా నిరాశ‌ప‌ర్చారు.

రేటింగ్.2.5|5

Next Story
Share it