Telugu Gateway
Latest News

అసెంబ్లీ ముట్టడికి బిజెపి యత్నం

అసెంబ్లీ ముట్టడికి బిజెపి యత్నం
X

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బిజెపి ప్రయత్నం చేసింది. బిజెపి కార్యకర్తలు పదుల సంఖ్యలో అసెంబ్లీ ముందుకు చేరుకుని ముఖ్యమంత్రి కెసీఆర్ కు వ్యతిరేకంగా, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భూ క్రమబద్దీకరణ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు వ్యతిరేకంగా వీరు అసెంబ్లీ ముట్టడి తలపెట్టారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకునేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గత కొంత కాలంగా బిజెపి ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకిస్తోంది.

Next Story
Share it