Telugu Gateway
Cinema

బిగ్ బాస్..ఆ 50 లక్షలు ఎవరికి?

బిగ్ బాస్..ఆ 50 లక్షలు ఎవరికి?
X

బిగ్ బాస్ సీజన్ ముగింపునకు వచ్చేసింది. అందుకే ఆదివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున విజేతగా 50 లక్షలు దక్కించుకుంటే ఎవరేమి చేస్తారో చెప్పమన్నారు. అభిజిత్ విజేతగా నిలిస్తే ఆయన ఎలా స్పందిస్తారో అరియానా చేసి చూపించింది. అరియానా గురించి అఖిల్ యాక్షన్ చేశాడు. ఇలా సరదా సరదాగా సాగింది ఈ ప్రొమోలో. సోహైల్ మాట్లాడుతూ ఎప్పుడూ నా అకౌంట్ లో లక్ష దాటి లేదు సర్ అని చెబుతాడు. హారిక మాత్రం ఆ డబ్బు అంతా తన మమ్మీకి ఇచ్చేస్తానని చెబుతుంది. అభిజిత్ అయితే డబ్బు అంతా ఇంట్లో ఇచ్చేసి ఇది మీది..ఏమి చేసుకుంటారో వదిలేస్తానని చెబుతాడు. నాగార్జున జోక్యం చేసుకుని మరి లాస్ వెగాస్ కు ఏమి సైడ్ వేయటం లేదా అని ప్రశ్నిస్తాడు. హారిక కూడా అభిజిత్ ను ఆటపట్టిస్తూ అసలు వదిలే ప్రసక్తిలేదు అని చెబుతుంది.

అఖిల్ మాత్రం తాను 50 లక్షలు గెలిస్తే తాను కెఫే ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెబుతాడు. అంతే కాదు..దీనికి నాగార్జున కూడా ఖచ్చితంగా రావాలని కోరతాడు. తాను సోహైల్ తో కలసి తొమ్మిది గంటల తర్వాత వస్తానని చెబుతాడు. ఇంతకీ కేఫే పేరు ఏమైనా ఆలోచించావా అంటూ అఖిల్ ను బుక్ చేసే ప్రయత్నం చేస్తాడు నాగార్జున. ఇలా సరదా సరదా సన్నివేశాలతో ఆదివారం షో సాగనుంది. నాగార్జున బాయ్స్ మంచి ఊపులో ఉన్నారు అంటే..హారిక మాత్రం ఉంటారు ఉంటారు ఎందుకుండరు అంటూ ఓ ఝలక్ ఇస్తుంది. ఫుల్ ఎపిసోడ్ లో ఎన్ని మెరుపులు ఉంటాయో ఎపిసోడ్ లో చూడాల్సిందే. శనివారం నాటి ఎపిసోడ్ లో సోహైల్ కూడా టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ఇఫ్పటికే అఖిల్ ఫినాలే మెడల్ తో టాప్ 5లో తొలి వ్యక్తిగా నిలిచాడు. మరి ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో వేచిచూడాల్సిందే.

Next Story
Share it