వాల్తేర్ వీరయ్య 183 కోట్లు..వీరసింహారెడ్డి 121 కోట్లు

సంక్రాంతి బరిలో నిలిచి వాల్తేరు వీరయ్య కంటే ఒక రోజు ముందు అంటే జనవరి 12 న విడుదల అయిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి పది రోజులకు గాను 121 కోట్ల రూపాయల గ్రాస్...72 .24 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇప్పటికి వీరసింహ రెడ్డి తో పోలిస్తే వాల్తేర్ వీరయ్య వసూళ్లే ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు ఇక సోమవారం నుంచి వసూళ్లు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఒకే సారి రెండు పెద్ద సినిమాలను విడుదల చేసి అందులోనూ విజయం సాధించటం టాలీవుడ్ లో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు.