Telugu Gateway
Cinema

ముంబ‌య్ లో విజ‌య్..ర‌ష్మిక హ‌ల్ చ‌ల్

ముంబ‌య్ లో విజ‌య్..ర‌ష్మిక హ‌ల్ చ‌ల్
X

టాలీవుడ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న‌ల‌ది మంచి హిట్ పెయిర్. ముఖ్యంగా వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టించిన గీతాగోవిందం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత డియ‌ర్ కామ్రెడ్ చేశారు. ఈ సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోయినా వీరిద్ద‌రి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులేప‌డ్డాయి. ఇప్పుడు విజయ్ దేవ‌ర‌కొండ అన‌న్యపాండేతో క‌ల‌సి లైగ‌ర్ సినిమా చేస్తున్నాడు. ర‌ష్మిక హీరోయిన్ గా న‌టించిన పుష్ప సినిమా ఇటీవ‌లే విడుద‌లై దుమ్మురేపుతోంది. ఈ త‌రుణంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌లు ముంబ‌య్ లో హ‌ల్ చ‌ల్ చేశారు.

వీరిద్ద‌రూ క‌ల‌సి రెస్టారెంట్ లో డిన్న‌ర్ చేశారు. ముంబ‌య్ లోని బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో వీళ్లిద్ద‌రూ ఫోటోగ్రాఫర్ల కంట‌ప‌డ్డారు. ఈ పోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిని వీరిద్ద‌రూ ఖండించారు. అయితే ఇప్పుడు ముంబ‌య్ లో వీరిద్ద‌రూ డిన్న‌ర్ భేటీ జ‌ర‌పటం, ఆ త‌ర్వాత కారులో క‌ల‌సి తిర‌గ‌టం మ‌ళ్ళీ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

Next Story
Share it