Telugu Gateway
Cinema

వారసుడు వెనక్కి తగ్గాడు

వారసుడు వెనక్కి తగ్గాడు
X

సంక్రాంతి సినిమాల సందడి మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. వాస్తవానికి ఫస్ట్ తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా విడుదల జనవరి 12 న అన్నారు..తర్వాత 11 కు మార్చారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా జనవరి 14 కు మారింది. అంటే బాలకృష్ణ హీరో గా నటించిన వీరనారసింహ రెడ్డి జనవరి 12 న విడుదల కానుండగా, చిరంజీవి, రవి తేజ లు కలిసి చేసిన వాల్తేర్ వీరయ్య సినిమా 13 న విడుదల కానుంది.

దీంతో థియేటర్ ల సమస్య కూడా రానుంది. ఇది పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమా వాయిదా వేసుకున్నారు. చివరి నిమిషంలో దిల్ రాజు ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు.. దీనిపై మీడియా సమావేశం లో స్పందిస్తూ దిల్ రాజు ను ఎవరూ కార్నర్ చేయలేరు అన్నారు. పెద్ద హీరో ల కోసం ఎక్కువ థియేటర్ లు కావాలని అందుకే తెలుగు లో దీన్ని వాయిదా వేసుకున్నామని వెల్లడించారు.

Next Story
Share it