Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ టైటిల్ వివాదం!

పవన్ కళ్యాణ్ టైటిల్ వివాదం!
X

జనసేన అధినేత అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏమి చేసినా వివాదం అవుతోంది. ఇటీవలే అయన తన ఎన్నికల ప్రచారం కోసం వారాహి వెహికల్ ను సిద్ధం చేయించుకున్నారు. ఈ వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగు ఉండటంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ వాహనాలకు తప్పించి ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటానికి వీలు లేదని నిబంధనలు చెపుతున్నాయి. కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు మరో వివాదం స్టార్ట్ అయింది. అయితే ఈ సారి ఇది సినిమా టైటిల్ కు సంబంధించినది . ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ సినిమా కు సంబంధించి టైటిల్ ప్రకటించారు. ముందు ప్రకటించిన సినిమా టైటిలే మార్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత భవదీయుడు భగత్ సింగ్ పేరు పెట్టాడు.

ఇప్పుడు దాన్ని మర్చి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. నిజంగా కూడా ముందు ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ టైటిలే కాస్త బాగుంది. ఇప్పుడు ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పై కళ్యాణ్ అభిమానులు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భగత్ సింగ్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇది ఏ మాత్రం బాగాలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ టైటిలే కాస్త విచిత్రంగా ఉంది అంటే దీనికి పెట్టిన టాగ్ లైన్ కూడా మరింత విచిత్రంగానే.. మనల్ని ఎవడ్రా ఆపేది అని పెట్టారు. చూస్తుంటే ఇది రాజకీయ కోణంలో పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ టైటిలే విషయంలో చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందా లేక ఆలాగే ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంటే ....దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it