Telugu Gateway
Cinema

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం అంటే..పూజా హెగ్డేనే హీరోయిన్!

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం అంటే..పూజా హెగ్డేనే హీరోయిన్!
X

వ‌ర‌సగా మూడు సినిమాల్లోనూ అదే సీన్ రిపిట్

ఇప్పుడు మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్..పూజాల హ్యాట్రిక్ కాంబినేష‌న్

మామూలుగా ద‌ర్శ‌కుడు, హీరోల హ్యాట్రిక్ కాంబినేష‌న్ లు చూస్తుంటాం. హీరోలు..హీరోయిన్ల హ్యాట్రిక్ కాంబినేష‌న్లు కూడా జ‌రుగుతుంటాయి. కాక‌పోతే ఇదో వెరైటీ. ఇది ద‌ర్శ‌కుడు..హీరోయిన్ ల హ్యాట్రిక్ కాంబినేష‌న్. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం అంటే పూజా హెగ్డెనే హీరోయిన్ అన్న‌ట్లు పిక్స్ అవుతున్నారు టాలీవుడ్ లో ఈ మ‌ధ్య‌. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రానున్న కొత్త సినిమా గురువారం నాడు హైద‌రాబాద్ లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడీగా మ‌రోసారి పూజా హెగ్డె న‌టిస్తోంది. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మ‌హేష్ బాబు పాల్గొన‌లేదు.

కానీ ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, పూజా హెగ్డె, హారిక‌, హాసిని క్రియేష‌న్స్ అధినేత ఎస్. రాధాక్రిష్ణ తదిత‌రులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, పూజా హెగ్డెలకు ఇది హ్యాట్రిక్ సినిమా. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌లో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె, అల‌వైకుంఠ‌పురంలో అల్లు అర్జున్ కు జోడీగా పూజా హెగ్డె..ఇప్పుడు మ‌హేష్ బాబు కొత్త సినిమాలోనూ పూజా హెగ్డెనే హీరోయిన్. అంటే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వ‌ర‌స మూడు సినిమాల్లోనూ పూజానే హీరోయిన్ కావ‌టం విశేషం.

Next Story
Share it