Telugu Gateway
Cinema

అభిమాని వెరైటీ ప్రయత్నం

అభిమాని వెరైటీ ప్రయత్నం
X

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ కు పెద్ద ఎత్తున ఫాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఫాన్స్ అప్పుడప్పుడు తమ అభిమానాన్ని వెరైటీ గా తెలియచేస్తూ ఉంటారో. అలాంటిదే ఈ విషయం కూడా. ఇటుక ఇటుకపై ఎన్టీఆర్ పేరుతో వాటిని సిద్ధం చేయించారు. ఆ ఇటుకలనే ఇంటి నిర్మాణానికి వాడుతున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కర్నూల్ జిల్లాలోని ఎన్టీఆర్ అభిమాని ఒకరు కొత్త ఇల్లు కట్టించుకునే సమయంలో ఇటుకుల పై ఎన్టీఆర్ పేరు ఉండేలా చూసుకున్నాడు. ఆయనే ఈ ఇటుకలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోవా లో ఈ సినిమా షెడ్యూల్ సాగుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Next Story
Share it