Telugu Gateway
Cinema

హీరో భార్యకు నచ్చలేదని నన్ను తీసేశారు

హీరో భార్యకు నచ్చలేదని నన్ను తీసేశారు
X

తాప్సి పన్ను. పలు సంచలన విషయాలను బయటపెట్టారు. హీరో భార్యకు నచ్చని కారణంగా తనను ఓ సినిమా నుంచి తప్పించారని పేర్కొన్నారు. తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బహిర్గతం చేశారు. కెరీర్ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఒక సారి తాను డబ్బింగ్ చెబుతున్న సమయంలో హీరోకు తన డైలాగ్ లు నచ్చలేదని,అవి మార్చాలంటే తాను అందుకు అంగీకరించకపోవటంతో తప్పించారని తెలిపింది. హీరో గత సినిమా పెద్దగా ఆడలేదు కాబట్టి బడ్జెట్ తగ్గించాల్సిన అవసరం ఉందని..అందుకని తన రెమ్యునరేషన్ తగ్గించాలని అడిగారని తెలిపారు.

ఓ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కంటే తన సీన్ మరింత శక్తివంతంగా ఉందనే కారణంతో హీరో అందులో మార్పులు చేయాలని కోరినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయాలన్నీ తన ముందే జరిగాయని..తెరవెనక ఇంకెన్ని జరిగాయో తనకుత తెలియదని తాప్సి వెల్లడించారు అప్పటి నుంచి ఎవరైతే నిజంగా తనతో పని చేయటానికి సంతోషంగా అంగీకరిస్తారో అలాంటి వారితోనే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేసిన తర్వాత కొంత మంది హీరోలు తమను హీరోయిన్లుగా తీసుకోవటానికి వెనకాడతారని తెలిపారు.

Next Story
Share it