Telugu Gateway
Cinema

పూజా హెగ్డె వివాదస్పద వ్యాఖ్యలు

పూజా హెగ్డె వివాదస్పద వ్యాఖ్యలు
X

దక్షిణాది వాళ్ళకు నడుము మత్తు...ఫైర్ అవుతున్న సోషల్ మీడియా

పూజా హెగ్డె. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగులో అగ్రహీరోల పక్కన వరస పెట్టి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. ఈ తరుణంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పూజా హెగ్డె వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు పూజా హెగ్డె ఏమి అన్నదంటే..' దక్షిణాది ప్రేక్షకులకు బొడ్డు, నడుం అంటే వ్యామోహంలో ఉంటారు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణం అయ్యాయి. గతంలో తాప్సీ కూడా ఓ సారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

ఇప్పుడు పూజా హెగ్డే వంతు వచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డె ప్రభాస్ తో కలసి రాధే శ్యామ్ సినిమాతోపాటు అఖిల్ అక్కినేని తో కలసి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల..వైకుంఠపురం' సినిమాలో తన కాళ్ల పాటలో పూర్తి స్థాయి ఎక్స్ పోజింగ్ చేసి ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులపై వ్యాఖ్యలు చేయటం ఏమిటని ఫైర్ అవుతున్నారు. ఆమె ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ ను కూడా తీసుకొచ్చారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై పూజా హెగ్డె ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it