సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత!
BY Admin27 Nov 2021 9:15 PM IST
X
Admin27 Nov 2021 9:26 PM IST
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం పాలయ్యారు. ఆయన తీవ్ర అస్వస్థతతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం శ్వాస కోస సంబంధ సమస్యలతో ఆయన కిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. న్యుమోనియా తోనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రిలో చేరారన్నారు. తీవ్ర అస్వస్థత పరిస్థితుల్లో లేరని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Next Story