Telugu Gateway
Cinema

యువ హీరో వరస ప్రాజెక్ట్ లు

యువ హీరో వరస ప్రాజెక్ట్ లు
X

టాలీవుడ్ యువ హీరో వరస సినిమాలతో దూసుకెళుతున్నాడు . ఇప్పటికే తెలుసుకదా సినిమా చేస్తున్న హీరో కొత్త సినిమా దసరా సందర్బంగా ప్రకటించారు. దీంతో పాటు టిల్లు క్యూబ్ కూడా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. సిద్దూ జొన్నలగడ్డ ఇప్పుడు కోహినూర్ గా మారబోతున్నారు. వరసగా రెండు సినిమాలు ఏ నిర్మాణ సంస్థలో అయితే హిట్ కొట్టారో..అదే సంస్థలో ఇప్పుడు మూడవ సినిమాకు రెడీ అయ్యారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సిద్దూ తో కలిసి ఇప్పుడు కోహినూర్ సినిమా తెరకెక్కించనుంది.

దసరా సందర్బంగా ఫస్ట్ లుక్ తో పాటు రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల తేదీ కూడా ప్రకటించారు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తొలి భాగం 2026 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మా హక్కులను చెప్పటానికి 1000 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. భద్రకాళి వైభవాన్ని ఈ వీరుడు తిరిగి తీసుకువస్తాడు అంటూ నిర్మాత నాగ వంశీ ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ లుక్ లో వెల్లడించారు. ఇదే నిర్మాణ సంస్థలో సిద్దూ జొన్నలగడ్డ డీ జె టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి హిట్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it