'సర్కారు వారి పాట' పాటలు పూర్తి
BY Admin22 Oct 2021 4:55 PM IST

X
Admin22 Oct 2021 4:55 PM IST
మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. పరశ్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి పాటల కంపొజిషన్ పూర్తి అయిందని మ్యూజిక్ డైరక్టర్ తమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ బాబుతో కలసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుబాయ్ లో చిత్ర యూనిట్ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా కొద్దిగా గ్యాప్ వచ్చినా మళ్లీ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Next Story