Telugu Gateway
Cinema

చిన్న ఎఫైర్ కు ఎందుకంత ఏడుపు?

చిన్న ఎఫైర్ కు ఎందుకంత ఏడుపు?
X

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి తన ఒకప్పటి సన్నిహితుడు, హీరో హృతిక్ రోషన్ పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ వేదికగా ఆమె హృతిక్ ను టార్గెట్ చేసింది. 'హృతిక్ విచార గాధ మళ్లీ మొదలైంది. అతడు తన భార్య నుంచి విడాకులు తీసుకుని, నాతో విడిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి. కానీ అతడు తన జీవితంలో ముందుకు వెళ్ళడాన్ని నిరాకరించాడు. మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడు. ధైర్యం కూడగట్టుకుని వ్యక్తిగత జీవితంపై ఆశతో నేను ముందుకుకెళుతున్న సమయంలో హృతిక్‌ మళ్లీ పాత కథకు తెరలేపాడు. చిన్నపాటి ఎఫైర్‌ను పట్టుకుని ఇంకా ఎంతకాలం ఏడుస్తావ్‌' అంటూ ట్విటర్‌ వేదికగా కంగనా రనౌత్ మండిపడ్డారు.

దీనికి కారణం ఏమిటంటే కంగన ఈ-మెయిల్‌ ఐడి నుంచి తనకు మూకుమ్ముడిగా మెయిల్స్‌ వస్తున్నాయని అవి చాలా ఇబ్బందిగా ఉన్నాయని ఆరోపిస్తూ సైబర్‌ సెల్‌కు 2016లో హృతిక్‌ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో తన ఎఫ్‌ఐఆర్‌ను క్రైం బ్రాంచ్‌కు తరలించాల్సిందిగా ఇటీవలే హృతిక్‌ సైబర్‌ సెల్‌ను కోరాడు. దీంతో తన ఎఫ్‌ఐఆర్‌ను క్రైం బ్రాంచ్‌ సీఐయూ(క్రైం ఇంటలీజెన్స్‌ బ్యూరో)కు బదిలీ చేశారు. దీంతో కంగనా గురువారం సోషల్‌ మీడియా వేదికగా హృతిక్‌పై మాటల యుద్దానికి దిగింది.

Next Story
Share it