Telugu Gateway
Cinema

'సమంత' కొత్త కార్యక్రమం 'సామ్ జామ్'

సమంత కొత్త కార్యక్రమం సామ్ జామ్
X

బిగ్ బాస్ కు ఒక్క రోజు హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్న సమంత ఇప్పుడు మరో కొత్త పాత్రకు రెడీ అయ్యారు. ఆహా ఓటీటీలో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేయనున్నారు సమంత. ఇవి ప్రత్యేక కార్యక్రమంగా చేపడుతున్నారు. ఆహా ఓటీటీ ప్రత్యేక కార్యక్రమం పెట్టి మరీ ఈ విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడారు. 'చాలారోజుల తర్వాత ఇంట్లో ఎక్కువ సమయం గడిపే సమయం వచ్చింది. ప్రజలు చాలా సమస్యలు ఫేస్‌ చేశారు. కానీ ఎవరినీ తప్పు పట్టలేం. మనతో పాటు మన చుట్టు ఉన్నవాళ్లు, వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఓ గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌ అనొచ్చు. సామ్‌జామ్‌ షో చాలా పెద్ద ఛాలెంజ్‌. దీంతో పోల్చితే యాక్టింగ్‌ చాలా సులభమనిపిస్తుంది.

హోస్టింగ్‌ సులభం కాదు. నాకు ఓ ఎక్స్‌ టెన్షన్‌లాంటి షో అని భావిస్తున్నాను. ఇది అందరికీ సంతోషాన్ని అందించే షో అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సమయంలో ఈ షో చేయడం ముఖ్యం అనిపించడంతో ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నాను. సామ్‌ జామ్‌ విషయానికి వస్తే మంచి టీం కుదిరింది. బిగ్‌బాస్‌ను హోస్ట్‌ చేయడమనేది నాగ్‌ మామ నిర్ణయం. బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ చేసే సమయంలో నాకు నిద్ర పట్టేది కాదు. చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. ఓ ఛాలెంజ్‌గా తీసుకుని హోస్ట్‌ చేశాను. సామ్‌ జామ్‌ విషయానికి వస్తే.. ఇది టాక్‌ షో కాదు, సమాజంలో సమస్యల గురించి మాట్లాడుతాం. టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. నేను మాధ్యమం గురించి ఆలోచించలేదు. ఓ ఛాలెంజింగ్‌గా అనిపించడంతో షో చేయడానికి ఒప్పుకున్నాను.." అని సమంత తెలిపారు.

Next Story
Share it