Telugu Gateway
Cinema

సమంత..సైకిల్

సమంత..సైకిల్
X

మాల్దీవుల్లో నా ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటోంది సమంత.. ఓ రోజు బీచ్ లో..మరో రోజు ఇంకో చోట. ఇప్పుడు సైకిల్ తీసుకుని సవారీకి బయలుదేరింది ఈ భామ. బుదవారం నాడు సమంత తాజాగా కొన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అదే ఈ సైకిల్ పోటో. ప్రస్తుతం మాల్దీవుల్లో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది. భర్త నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరూ మాల్దీవుల్లో మకాం వేశారు. అంతే కాదు..పూర్తి స్థాయిలో చిల్ అవుతున్నారు. వీరు షేర్ చేసే ఫోటోలు అదే విషయాన్ని చెబుతున్నాయి.

సెలబ్రిటీలు అందరూ ఈ సారి చలో మాల్దీవులు అంటూ బయలుదేరారు. కరోనా సమయంలో దేశంలోకి ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించటం ఒకెత్తు అయితే..మాల్దీవుల పర్యటనకు ఇది ఎంతో అనుకూల సమయం కావటం కూడా మరో అంశం. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్లుగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఫ్రణీత, సమంతలు మాల్దీవుల పర్యటనల్లో ఉన్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు కూడా అక్కడే సేద తీరుతున్నారు. అయితే కాజల్ మాత్రం పెళ్ళి తర్వాత హానీమూన్ కు వెళ్ళింది. మిగిలిన వారు హాలిడే ఎంజాయ్ లో భాగంగా టూర్ చేస్తున్నారు.

Next Story
Share it