స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఆర్ఆర్ఆర్ హీరోలు
BY Admin20 March 2022 5:44 PM IST
X
Admin20 March 2022 5:44 PM IST
మొన్న దుబాయ్, నిన్న కర్ణాటక. నేడు బరోడా. ఆర్ఆర్ఆర్ టీమ్ వరస పెట్టి దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఆదివారం నాడు ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళిలు కేవాడియాలోని స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో తెలంగాణ సర్కారు ఈ సినిమా రేట్లు పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏపీ సర్కారు కూడా పేదలు పేదలు అంటూ జపించి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.
Next Story