Telugu Gateway
Cinema

రాజమౌళి అది కూడా కొట్టారు

రాజమౌళి అది కూడా కొట్టారు
X

ఎప్పుడు అయితే ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మన్స్ కు ఛాన్స్ దక్కిందో అప్పుడే దీనికి ఆస్కార్ ఫిక్స్ అయింది. అయితే అధికారికంగా ప్రకటిస్తే తప్ప దీనికి విలువ రాదు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు అది కూడా పూర్తి అయింది. భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కకపోయినా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి తన ప్రయత్నంతో జనరల్ కేటగిరీ విభాగంలో నామినేషన్ దక్కేలా కృషి చేశారు. అంతే కాదు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించి చరిత్ర సృష్టించారు. భారతీయ సినిమా పరిశ్రమకు...ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇది ఒక సంచలన, ఘనవిజయం అని చెప్పొచ్చు. ఈ అవార్డు తో రాజమౌళి కొత్త చరిత్ర నెలకొల్పారు. తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. దేశంలో ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా 'ఆర్.ఆర్.ఆర్' లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం.

దర్శకుడు రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. 'ఆర్.ఆర్.ఆర్' మార్చి 24, 2022 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సంచలమం సృష్టించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు, ఈ పాటకి ఈ ఇద్దరు నటులు అదిరిపోయే డాన్స్ చేశారు. వెళ్లద్దరి డాన్స్ సింక్ పాటలో హై లైట్ అని చెప్పొచ్చు. హీరో లు ఎన్టీఆర్, రాంచరణ్ లు ఇద్దరు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. నామినేషన్స్ కు ముందు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి విపరీతమయిన ప్రచారం చేశారు. అక్కడ టాక్ షో, రేడియో లో ఇద్దరు నటులు ఇంటర్వూస్ ఇచ్చారు. తమ సినిమాకి ప్రచారం చేశారు. దర్శకుడు రాజమౌళి అయితే అమెరికా లో చాలా కాలం ఉన్నారు. , 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని ప్రమోట్ చేశారు. స్టీవెన్ స్పెల్ బెర్గ్ , క్రిస్టోఫర్ నోలన్ జేమ్స్ కామెరాన్ లాంటి పెద్ద పెద్ద దర్శకులని కలిసి వాళ్ళకి సినిమా చూపించి, వాళ్ళచేత ఎంతగానో ప్రశంసలు పొందారు. ప్రపంచం లో పేరెన్నికగన్న అంతటి పెద్ద దర్శకులు మన తెలుగు సినిమా గురించి మాట్లాడటమే ఒక అద్భుతం.

Next Story
Share it