Telugu Gateway
Cinema

బ్లూ టూత్ ఎయిర్ పాడ్స్ డేంజర్ !

బ్లూ టూత్ ఎయిర్ పాడ్స్ డేంజర్ !
X

యువత ఇప్పుడు నేరుగా ఫోన్ మాట్లాడటం కంటే...ఎయిర్ పాడ్స్ వాడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. మెట్రో తో పాటు బయట కూడా ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విషయానికి సంబంధించి రేణు దేశాయ్ తాజాగాఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. పాత పద్ధతి అయిన వైర్లతో కూడిన ఇయర్ ఫోన్స్ మాత్రమే వాడాలని తాను అకీరా, ఆద్యాలకు సూచించినట్లు వెల్లడించారు. బ్లూ టూత్ టెక్నాలజీ వల్ల చెవులు, బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉంది అని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అకీరా ఇప్పుడు ఫ్యాన్సీ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కంటే వైర్లతో కూడిన ఇయర్ ఫోన్స్ వాడుతున్నట్లు చెపుతూ ఆ ఫోటోను షేర్ చేశారు. అకీరా మెల్లగా అయినా తాను చెప్పిన బాటలోకి వచ్చినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల తనయుడే అకీరా అన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అకీరా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు...త్వరలోనే సినిమాల్లోకి వస్తాడు అంటూ ప్రచారం జరిగింది.

Next Story
Share it