Telugu Gateway
Cinema

అరియానాకు వర్మ మద్దతు

అరియానాకు వర్మ మద్దతు
X

అరియానాకు ఊహించని మద్దతు లభించింది. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెకు ఓట్లు వేయాలని ట్విట్టర్ వేదికగా కోరాడు. అరియానా మధ్యలో కొన్ని సార్లు హౌస్ లో ఫ్రస్టేషన్ కు లోనైనా కూడా తాజా టాస్క్ ల్లో మాత్రం దుమ్మురేపుతోంది. "సహ‌నం" టాస్క్ లో ఆమె ముందు త‌న ప్రాణ‌మైన బొమ్మ‌ను న‌లిపేస్తున్నా ఉద్వేగాన్ని లోలోప‌లే అణుచుకుంటూ చ‌ల‌నం లేకుండా, ఎలాంటి ఎక్స్‌ ప్రెష‌న్స్ లేకుండా శిలావిగ్ర‌హంలా ఉండిపోయింది. టాస్క్ పూర్తైన త‌ర్వాత మాత్ర‌మే త‌న ఎమోష‌న్ అంతా బ‌య‌ట‌కు క‌క్కేసింది. అరియానాకు ఓటేసి గెలిపించాల‌ని రామ్ గోపాల్ వర్మ ప్ర‌చారానికి దిగారు. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచేందుకు అరియానాకే అర్హ‌త ఉంద‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు.

ఆర్జీవీ స‌పోర్ట్ దొర‌క‌డంతో అరియానా ఫ్యాన్స్ తెగ సంతోష‌ప‌డుతున్నారు. బిగ్ బాస్ నుంచి ఆమె బ‌య‌ట‌కొచ్చాక సినిమా తీయ‌డానికీ సిద్ధ‌మేన‌ని వ‌ర్మ ఈ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆమెను గెలిపించాలని కోరాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్లలో ఇప్ప‌టివ‌ర‌కు అమ్మాయి విన్న‌ర్‌గా నిలిచింది లేదు. రెండో సీజ‌న్‌లో గీతా మాధురి, మూడో సీజ‌న్‌లో శ్రీముఖి గెలుపు అంచుల వ‌ర‌కూ వెళ్లిన‌ప్ప‌టికీ చివ‌రికి ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకున్నారు. అరియానా ఈ ఒక్క వారం ఎలిమినేష‌న్ గండం నుంచి త‌ప్పించుకుంటే నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ఓట్ల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల‌ను రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తోంది. చూడాలి మరి వర్మ ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో.

Next Story
Share it