Telugu Gateway
Cinema

అమెరికాలో రాంచరణ్ హంగామా

అమెరికాలో రాంచరణ్ హంగామా
X

ఆర్ఆర్ఆర్ హీరో రాంచరణ్ మరో సారి అమెరికా చేరుకున్నారు. దీనికి సంబదించిన ఫోటో లు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించటం..ఈ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయినా విషయం తెలిసిందే మార్చ్ 12 న ఆస్కార్ అవార్డు లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కూడా రాంచరణ్ పాల్గొనే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తమకు అవార్డు వస్తుంది అనే ధీమాతో ఉంది. దీనికి ప్రధాన కారణం ఆస్కార్ రేస్ లో ఆర్ఆర్ఆర్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ అవార్డు ల ప్రకటన కంటే ముందు రాంచరణ్ పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని చెపుతున్నారు. అమెరికాలోని న్యూ యార్క్ చేరుకున్న రాంచరణ్ అక్కడ భారతీయ సినీ అభిమానులతో కలిసి సరదాగా ఫోటో లు దిగారు.

ప్రస్తుతం ఈ మెగా హీరో ప్రముఖ దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా లో రాంచరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలోనే మరో హీరో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు రాజమౌళి కూడా అమెరికా చేరుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. అమెరికాలో ఒక ఇంటర్నేషనల్ మీడియా తో మాట్లాడిన రాంచరణ్ తాను తారక్ మంచి స్నేహితులం అని వెల్లడించారు. తాను తండ్రి కాబోతున్న విషయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించటానికి ముందు ఈ విషయం తారక్ కు చెప్పినట్లు వెల్లడించారు.

Next Story
Share it