విడాకులే సెలబ్రేట్ చేసుకోవాలి
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమీర్ ఖాన్ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. అమీర్ ఖాన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న అంశంపై స్పందిస్తూ..మీ బాధ ఏంటి..పెళ్లి కంటే ..విడాకులే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం అంటూ వ్యాఖ్యానించారు. పెళ్ళి అన్నది మూర్ఖత్వంతో..అజ్ణానంతో తీసుకునే నిర్ణయం అయితే..విడాకులు అనేది జ్ణానం..తెలివితో తీసుకునే నిర్ణయం అంటూ ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్, కి రణ్ రావులు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో మరింత సంతోషంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
గతం కంటే మరింత రంగుల మయంగా వీరి జీవితాలు ఉండాలంటూ వర్మ అభినందనలు తెలిపారు. అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవటం ఇది రెండవ సారి. మొదటి బార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకున్న పదిహేనేళ్ల తర్వాత విడిపోయారు. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్ తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కిరణ్ రావు తాజా విడాకులకు ఇదే కారణం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.