రజనీకాంత్ కు మరిన్ని పరీక్షలు
హై బీపీతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ మరికొంత కాలం ఆస్పత్రిలో ఉండనున్నారు. అపోలో ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు ఆయనకు మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
రజనీని కలిసేందుకు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు. రజినీకాంత్ కుమార్తె ఆయనతోనే ఉన్నారని అపోలో వైద్యులు వెల్లడించారు. చెన్నయ్ నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి రజనీకాంత్ ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.